గడువులోపు వందశాతం పన్ను వసూలు చేయాలి
మెట్‌పల్లి: ఆస్తి పన్ను బకాయిలను ఈనెల 31లోపు వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. పట్టణంలో చేపడుతున్న ఆస్తి పన్ను వసూళ్లను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బకాయిదారులతో మాట్లాడి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. నెలాఖరు వరకు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ ఉందన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ ఉన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించండి
జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీల్లో ఈనెల 31వరకు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు గడువు ఉందని ఎంపీవో రవిబాబు అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తుందన్నారు. 2020లో రూ.వెయ్యి ఫీజు చెల్లించిన వారికి ప్రస్తుతం అవకాశం ఉందన్నారు. ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వారంతా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని కోరారు. ఇంటి పన్నులను ఈనెల 25లోపు ప్రతిఒక్కరూ చెల్లించాలని కోరారు. తిమ్మాపూర్ గ్రామంలో ఎల్‌ఆర్‌ఎస్ రుసుం ఆన్‌లైన్ చెల్లింపులను డీపీవో మదన్‌మోహన్ పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్ వెంటనే చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment