14న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
మెట్‌పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 14న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి గలవారు మధ్యాహ్నం మూడు గంటలకు అర్హతపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జగిత్యాలరూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో బుధవారం మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. మహిళ సంఘాలకు ఇందిరామహిళ శక్తి కార్యక్రమం కింద ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తోందన్నారు. డీపీఎం మాణిక్‌రెడ్డి, ఏపీఎం గంగాధర్, డీఎంసీ దేవయ్య, సీసీలు గంగారాం, మరియ, విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలి
జగిత్యాలటౌన్: ప్రభుత్వం విడుదల చేసే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టం తేవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాంమాదిగ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే గ్రూప్–1, 2, 3, 4 సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు నురుగు శ్రీనివాస్, బెజ్జంకి సతీష్, బోనగిరి కిషన్, నక్క గంగారాం, నక్క రమేష్, సంకెపు ముత్తు, కొల్లూరు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో ‘ఏఐ’ బోధన
జగిత్యాల: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు డీఈవో రాము తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. ఈనెల 15 నుంచి ఎంఈవోలు, అకాడమిక్ మానిటరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఏఐ వాడటానికి అనుకూలంగా ఉండేలా కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులకు ఏఐ ద్వారా వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చేలా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కో–ఆర్డినేటర్ రాజేశ్ పాల్గొన్నారు.
రంగుమారిన తాగునీరు
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధి 13వ వార్డు సుతారిపేటలో కొన్ని రోజులుగా తాగునీరు కలుషితం అవుతోంది. రంగుమారిన నీరు వస్తోందని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
14న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
14న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
14న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment