ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయండి
● మొక్కజొన్న, కందులు కొనాల్సిందే ● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: భవన నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక డంపులను అరికట్టడంలో కలెక్టర్ చొరవను అభినందించిన ఆయన.. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కజొన్నలకు గతేడాది క్వింటాల్‌కు రూ.2500 ఉండగా.. ఇప్పుడు రూ.రెండువేలకు పడిపోయిందని, మొక్కజొన్నలు, కందులు కొనాలని సీఎంకు లేఖ రాశానన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్ భారి, సురేందర్, రఘువీర్‌గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment