వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్ అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి విద్యుత్ అధికారి వారికి నిర్దేశించిన హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ రోజువారి విద్యుత్ లోడ్‌ను సమీక్షించాలన్నారు. పంటలు పూర్తయ్యేవరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్
Comments
Please login to add a commentAdd a comment