షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ హామీ నిలబెట్టుకోవాలి
మెట్‌పల్లి: అధికారంలోకి రాగానే ముత్యంపేటలోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు అన్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అర్వింద్ కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటైందని, పసుపు రైతుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్, సుంకేట విజయ్, బొడ్ల ఆనంద్, గౌతమ్ తదితరులున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం తగదు
మెట్‌పల్లిలో బీజేపీ నాయకుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment