లైట్లు బిగించాలి
జిల్లాకేంద్రంలోని మినీస్టేడియం ముందు గేట్ వద్ద, వెనుకవైపు కాలేజీ సమీపంలో స్తంభాలు ఏర్పాటు చేసి స్ట్రీట్‌లైట్స్ బిగించాలి. ఆ వైపు చిమ్మచీకటిగా ఉంటోంది. లైట్లు లేక ఉదయం, సాయత్రం వాకర్స్, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లైట్లు లేక మలవిసర్జన చేస్తున్నారు.
– మచ్చ శంకర్, జగిత్యాల
రాత్రిపూట భయంభయంగా
రాయికల్‌లోని 3వ వార్డు ఇందిరానగర్‌లో విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఇందిరానగర్ నుంచి మెయిన్ రోడ్ వరకు విద్యుత్ స్తంభాలు లేక రాత్రిపూట కాలనీలోకి రావాలంటేనే భయాందోళనగా ఉంది.
– రాజేశ్, రాయికల్
వీధిలైట్లు ఏర్పాటు చేయాలి
కోరుట్లలోని కల్లూరు రోడ్‌లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. ము న్సిపల్ అధికారులు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తున్నా అవి తొందరగానే చెడిపోతున్నాయి. అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం
లేదు.
– లవంగ సాగర్,
కోరుట్ల
●
లైట్లు బిగించాలి
Comments
Please login to add a commentAdd a comment