పరీక్షలు ప్రశాంతంగా రాయండి
● ఎవరూ ఒత్తిడికి లోనుకావద్దు ● ‘పది’ విద్యార్థులతో కలెక్టర్
జగిత్యాల: ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, ఎవరూ ఒత్తిడికి లోనుకావద్దని కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో వర్చువల్ ద్వారా మాట్లాడారు. పరీక్షలంటే విద్యార్థులు భయపడొద్దని, ఉపాధ్యాయుల సూచనలు పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష రాసేముందు ఆరోగ్య నియమాలు పాటించాలని, పార్ట్‌బీ ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పిదాలూ దొర్లకుండా చూసుకోవాలన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేలా చూడాలి
అర్హులు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మండలాలవారీగా అధికారులతో బుధవారం సమీక్షించారు. మున్సిపల్, మండలాల పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు రుసుం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీపీవో మదన్‌మోహన్, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment