అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రాయికల్: అభివృద్ధి పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. రా యికల్ మండలం బోర్నపల్లిలో రూ.20 లక్షలతో చేపడుతున్న హెల్త్ సబ్‌సెంటర్, ఇటిక్యాలలో రూ.9 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు, అల్లీపూర్‌లో రూ.20 లక్షలతో చేపడుతున్న పల్లె దవా ఖానా పనులను బుధవారం పరిశీలించారు. సబ్‌సెంటర్ పనులను నెలరోజుల్లోపు పూర్తి చే యాలని, బ్రిడ్జిపనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూద న్, డీఈ మిలింద్, తహసీల్దార్ ఖయ్యూం ఉన్నారు.
ఓటరు నమోదు పక్కాగా..
జగిత్యాల: జిల్లాలో ఎన్నికల నిర్వహణ, ఓటరు నమోదు పక్కాగా నిర్వహిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సందేహాలుంటే తెలపాలన్నారు. ఓటరు నమోదు నిరంతరమని, ఫాం–6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
పదో తరగతి పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్స్‌తో సమీక్షించారు. ఈనెల 21 నుంచి నిర్వహించే పరీక్షలకు 67 సెంటర్లు ఏర్పాటు చేశామని, 11,855 మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. డీఈవో రాము పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment