● బుక్‌లెట్ విధానంలో పది పరీక్షలు ● జిల్లాలో 67 సెంటర్
జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది అధి కారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఇప్పటికే వి ద్యార్థులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చి సంసిద్ధం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు లే కుండా వసతులు కల్పించారు. నిమిషం నిబంధన లేనప్పటికీ విద్యార్థులు అరగంట ముందే కేంద్రాల కు చేరుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే వీలుంటుంది. ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఫోన్‌ఇన్, ముఖాముఖి కా ర్యక్రమం ఏర్పాటు చేస్తూ విద్యార్థుల సందేహాలను తీర్చారు. జిల్లాలో మొత్తం 11,855 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, నలుగురు అడిషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, నలు గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 22 మంది కస్టోడియన్స్, 827 మంది ఇన్విజ్‌లేటర్లను నియమించారు.
వసతుల ఏర్పాటు
ఈ ఏడాది ఎండలు మండిపోతుండడంతో కేంద్రాల వద్ద తాగునీటి వసతి ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదు.
ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి నో
పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి అనుమతి లేదు. సీఎస్ డీవో, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఈ నిబంధన ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు ఉంటుంది.
బుక్‌లెట్ విధానంలో పరీక్షలు
ఈసారి జవాబులు రాసేందుకు విద్యార్థులకు బుక్‌లెట్ ఇస్తారు. ఇందులో మొత్తం 24 పేజీలుంటాయి. బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలకు 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. అలాగే ప్రతి ప్రశ్నపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎక్కడ లీకేజీ అయినా సంబంధిత చోట లీకేజీ అయినట్లు తెలిసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు పేర్కొంటున్నారు. హాల్‌టికెట్ పొందని వారు వెబ్‌సైట్ ద్వారాా సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఈవో
ప్రశాంతంగా రాయాలి
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. ప్రతి సెంటర్‌లో వసతులు ఏర్పాటు చేశాం. ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి తీసుకెళ్లకూడదు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలోచించి నిదానంగా పరీక్ష రాస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చు.
– రాము, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment