విద్యార్థుల కళ్లకు సురక్ష
కథలాపూర్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం వెలుగులు అందిస్తోంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ద్వా రా సమగ్ర కంటి పరీక్ష, ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్‌బీ ఎస్‌కే వైద్యులు పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి చూపు మందగించిన వారిని గుర్తించి అద్దాలు అందించాలన్నది ఉద్దేశం.
జిల్లాలో 45,626 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
ఆర్‌బీఎస్‌కే వైద్యుల ఆధ్వర్యంలో జిల్లాలోని 828 ప్రభుత్వ విద్యాసంస్థలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 45,626 మంది విద్యార్థులకు ఇటీవల కంటి పరీక్షలు చేశారు. వీరిలో 2,506 మంది విద్యార్థులకు కంటి సమస్యలు, దృష్టిలోపం మందగించి చదవడానికి, రాయడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. వీరికి తప్పనిసరిగా కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వీరికి ఆయా మండలకేంద్రాల్లోని పాఠశాలల్లో కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కళ్లద్దాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం
చూపు లోపం ఉన్నవారికి మేలు
Comments
Please login to add a commentAdd a comment