మహిళా సంఘాలకు ఎన్నికలు
జగిత్యాల: మహిళాసాధికారత కోసం గతంలో స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘాలకు ఓ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు ఉంటారు. తాజాగా కొత్త అధ్యక్షులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సంఘం సభ్యుల నుంచి గ్రామ, మండల, జిల్లా సమైక్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై మండలాల్లోని ఏపీఎం, సీసీ, డీఆర్డీఏ సిబ్బందికి జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ కల్పించారు. ఏపీఎంలు గ్రామస్థాయిలో వెళ్లి మహిళా సంఘాల అధ్యక్షుల ఎన్నికపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతమున్న అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవి కాలం ఈనెల 31తో ముగియనుండటంతో ఆ లోపు కొత్తవారిని ఎన్నుకోనున్నారు. జిల్లాలో 20 మండలాల్లో 14,957 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,72,614 మంది సభ్యులున్నారు. ఈ గ్రూపులకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు.
కొత్తవారికి అవకాశం
మహిళాసంఘాల్లో కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీరికి జిల్లా, మండలం, గ్రాస్థాయిలో కార్యవర్గాలున్నాయి. గ్రామస్థాయిలో ఒక్కో మహిళాసంఘానికి ఇద్దరు లీడర్లు, పాలకవర్గ సభ్యులుంటారు. అలాగే గ్రామ సమైక్యకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల చొప్పున ఐదుగురితో కార్యవర్గం ఉంటుంది. అలాగే మండల, జిల్లా సమైక్య కార్యవర్గాలుంటాయి. ఏటా మార్చిలో కొత్తవారికి అవకాశం కల్పిస్తుంటారు. ఇప్పుడున్న కార్యవర్గాలన్నింటినీ రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక స్వయం సహాయక సంఘంలో 10 నుంచి 15 మంది వరకు మహిళా సంఘ సభ్యులుంటారు. వీరంతా కలిసి ఆసక్తిగా ఉండి.. చదువుకున్న సభ్యులను ఎన్నుకుని తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కార్యవర్గంలో ఆసక్తి గల వారిని అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శిని ఎన్నుకుంటారు.
మహిళా సాధికారత కోసం..
మహిళాసంఘాలు ఏర్పడినప్పటి నుంచే వారు సాధికారత దిశగా పయనించాలనే దిశగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ రుణాలతోపాటు, శ్రీనిధి రుణాలు కూడా అందిస్తుంటారు. మహిళలకు ఇందులో గ్రూపునకు, గ్రూపు సభ్యులకు లోన్లు అందిస్తుంటారు. మహిళలందరూ కలిసి గ్రూపుగా ఏర్పడి చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఒక సభ్యుడికి సైతం రుణం అందుకుని చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరు క్రమం తప్పకుండా మళ్లీ ప్రతినెలా బ్యాంక్ లింకేజీ రుణం ఎత్తుకుంటే బ్యాంక్‌వారికి, శ్రీనిధి వారికై తే శ్రీనిధికి బ్యాంకుల్లో జమచేస్తుంటారు. వీరికి సంబంధించిన బ్యాంక్ లింకేజీ రుణాలు, సీ్త్రనిధి రుణాలు, ఏవీ ఇవ్వాలన్నా మహిళాసంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సీ్త్రనిధి బ్యాంక్ నుంచి లింకేజీ రుణాలు రూ.కోట్లలో లావాదేవీలు జరగడంతోపాటు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరికి సోలార్ ప్లాంట్లు, ఇటుక బట్టీల వ్యాపారాలు, పచ్చళ్ల వ్యాపారాలు చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తూ రుణాలు అందించనుంది. వాటితో మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. నూతన కార్యవర్గం ఏర్పడితే మరింత ఉత్సాహంతో పనిచేస్తూ మహిళలు ఇంకా సాధికారత సాధించే అవకాశాలుంటాయి. మార్చి నెలలో జిల్లా సమైక్య ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు.
కసరత్తు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ
ఈనెల లోపు పూర్తయ్యేలా ప్రక్రియ
జిల్లాలో 1,72,614 మంది సభ్యులు
శిక్షణ అందించాం
మహిళా సంఘాలకు నూతన కార్యవర్గాల ఏర్పాటుకు ఏపీఎం, సీసీలకు శిక్షణ అందించాం. ఈనెల వరకు ప్రస్తుతమున్న వారి పదవీకాలం ఉంది. అప్పటి వరకు పూర్తిగా ప్రణాళిక పూర్తి చేస్తాం. కొత్తవారికి అవకాశం ఇచ్చేలా చూస్తున్నాం. జిల్లాలో 14,957 మహిళా సంఘాలున్నాయి.
– రఘువరణ్,
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
మహిళా సంఘాలకు ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment