అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తికి చెందిన మతులపురం రాజం (55) అప్పుల బాధతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజంకు ఎకరంన్నర సొంత భూమి ఉంది. దాంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయా యి. ఈ క్రమంలో తనకున్న ఎకరం భూమి అమ్మి కొంత అప్పు చెల్లించాడు. ఇంకా రూ.10లక్షల వరకు అప్పు ఉంది. ఆ మొత్తం ఎలా చెల్లించాలా అని నిత్యం మదనపడుతున్నాడు. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సదాకర్ తెలిపారు.
ప్రభుత్వ భూమిని కాపాడుతాం
జగిత్యాలరూరల్: ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని నర్సింగాపూర్ శివారులోగల సర్వేనంబరు 437, 251లో అసైన్డ్ భూములను క్రయవిక్రయాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి పోర్టల్‌లో పట్టా చేసుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పహాణీలో డైరెక్ట్ ఎంట్రీలో సర్వేనంబరు 437లో 71.13 ఎకరాల, 251 సర్వేనంబరులో 19.07 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ముగ్గురు రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారని తెలిపారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి
చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపూర్‌తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్‌కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికు లు 108 అంబులెన్స్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు.
ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి అక్కడ జరిగిన రో డ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేటలో విషాదం నింపింది. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment