కనులపండువగా నృసింహస్వామి రథోత్సవం
రాయికల్: మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవం మంగళవారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు దేవుని నారాయణ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథంపై ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ తిప్పారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
థాయ్‌లాండ్‌కు మరో విమానం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కొలువుల కోసమని వెళ్లి థాయ్‌లాండ్ పరిసరదేశాల్లో సైబర్ కేఫ్‌ల్లో చిక్కుకు న్న యువతను ఇండియాకు తీసుకొచ్చే ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల అక్కడ చిక్కుకున్న యు వత దయనీయస్థితిని ‘సాక్షి’ వరుస కథనాలతో వె లుగులోకి తెచ్చింది. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా ఆదేశాలతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న 540మంది భారతీయులను రెండు సైనిక వి మానాల్లో సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. వారిని సీబీఐ, ఎన్‌ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు సంస్థలు విచారించిన అనంతరం స్వరాష్ట్రాలకు పంపారు. తాజా సమాచారం ప్రకారం.. మరికొందరు భారతీ య యువతీ, యువకులు ఇంకా అక్కడ చిక్కుకుపోయారని, వారిని కూడా రక్షించేందుకు కేంద్ర హోంశాఖ మరో విమానాన్ని థాయ్‌లాండ్‌కు పంపనుందని సమాచారం. ఈ వారాంతంలోగా మరో విమా నం ద్వారా వారిని తీసుకురానున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment