పరీక్ష కేంద్రాలకు వెళ్లేదెలా..?
కథలాపూర్: ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే గ్రామీణప్రాంతాల నుంచి పరీక్షకేంద్రాలకు వెళ్లడమే పరీక్షగా మారిందని మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు వాపోతున్నారు. ఈ ఏడాది మండలంలో 510 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నా యి. మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జెడ్పీ హైస్కూళ్లను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. ఈ కేంద్రాల్లో కథలాపూర్, సిరికొండ, చింతకుంట, భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పరీ క్ష రాయనున్నారు. చింతకుంట నుంచి కథలాపూర్ కు సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉండగా.. ఉద యం 7 గంటలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలంటే ఉద యం 8:30 గంటలకు చింతకుంట నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తే అదే రూట్‌లో ఉన్న భూషణరావుపేట, పెగ్గెర్ల విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల కు చేరుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష ఉదయమే కావడంతో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉండవని తల్లిదండ్రులు అంటున్నారు. మరోవై పు తక్కళ్లపెల్లి, బొమ్మెన జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బీమా రం మండలం మన్నెగూడెం జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఇవన్నీ మారుమూల గ్రామాలు కావడంతో ఆ రూట్‌లో బస్సు సౌకర్యమే లేదు. పరీక్షల వేళ బస్సు సౌకర్యం కల్పించాలని వి ద్యార్థులు కోరుతున్నారు. పోతారం జెడ్పీ హైస్కూ ల్ విద్యార్థులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబారిపేట జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఈ రూట్‌లో బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేకంగా ఉదయం 8:30 గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే పరీక్ష సమయానికి చేరుకోవడం కష్టమేనని ఆందో ళన చెందుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి పదో తరగతి పరీక్ష సమయానికి ఉదయం, మధ్యాహ్నం బస్సుల సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చేరని ఆర్టీసీ సేవలు
పరీక్షల వేళ బస్సు సౌకర్యం కల్పించాలంటున్న విద్యార్థులు
మండలంలో 510 మంది పదోతరగతి విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment