● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాదవ్
జనగామ: వినియోగదారులకు మెరుగైన సేవలందించే చర్యల్లో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు సేవలను సులభతరం చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాదవ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నూతన కనెక్షన్ దరఖాస్తును సాంకేతిక లోపంతో తిరస్కరించకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనల మేరకు పత్రాలు సమర్పించుకునేందు కు మరో అవకాశం ఇస్తామని చెప్పారు. ఇందుకు వినియోగదారుడి ఫోన్‌కు మెసేజ్ రూపంలో సమాచారం పంపిస్తామని తెలిపారు. ధ్రువీరణ పత్రాల ను నిర్దిష్ట సమయంలో సమర్పిస్తే ఆలస్యం కాకుండా కనెక్షన్ ఇచ్చే వీలుందని వివరించారు. వినియోగదారులు అప్లికేషన్ ఏస్టేజీలో ఉందో తెలుసుకునేందుకు కొత్తగా ట్రాకింగ్ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment