
31 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
ఖిలా వరంగల్ : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరె స్ట్ చేసి వారి వద్ద నుంచి 31కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలి పారు. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆర్పీఎఫ్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద మహారాష్ట్రలోని ఐరోలి కట్నానవీ గ్రామానికి చెందిన రాహుల్ రామ్ లఖన్ తివారీ, ముంబైలోని ఘున్సోలి థానే అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆశీష్ రామ్‌నాయక్ యాదవ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా రూ.7.75 లక్షల విలు వైన 31కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ ఎస్సై పేర్కొన్నారు.
కేసముద్రంలో నాలుగు కిలోలు..
కేసముద్రం: పోలీసులు నాలుగు కిలోల గంజాయిని పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు కథనం ప్రకారం.. కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన బానోత్ హరినాఽథ్, బయ్యారం మండలం బాల్య తండాకు చెందిన గుగులోత్ చరణ్, మరిపెడ మండలం గమ్యతండాకు చెందిన లునావత్ ప్రవీణ్ రైలులో ఒడిశాకు వెళ్లారు. అక్కడ నబీన్‌ప్రధాన్ అనే వ్యక్తి వద్ద రూ.లక్ష విలువైన నాలుగు కిలోల గంజాయి కొనుగోలు చేసి రైల్లో మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సోమవారం కేసముద్రం వచ్చారు. ఉప్పరపల్లి రోడ్డువైపు వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో అటువైపు సిబ్బందితో వెళ్లిన ఎస్సైకి వారు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించారు. నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ, ఎస్సై తెలిపారు.
వరంగల్‌లో 1,280 గ్రాములు..
వరంగల్: వరంగల్ గోవిందరాజులగుట్ట వద్ద గిర్మాజీపేటకు చెందిన వీరమల్ల సరోజిని, భూపాలపల్లి జిల్లా కారల్‌మార్క్స్‌కాలనీకి చెందిన మహ్మద్ అజార్ వద్ద సుమారు రూ.32వేల విలువైన 1,280 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకుర్ తెలిపారు. సోమవారం వీరి వద్ద గంజాయి లభించగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గంజాయి చాక్లెట్లు స్వాధీనం..
గీసుకొండ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పోలీసులు సోమవారం ముగ్గురి నుంచి 36 గంజా యి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పార్కు వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై ప్రశాంత్‌బాబు సిబ్బందితో వెళ్లారు. బిహార్‌కు చెందిన సన్నీ కుమార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన శుభం విశ్వకర్మను పట్టుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 12 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై చెప్పారు.
ఇద్దరి అరెస్ట్..
ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment