
ఒక నామినేషన్ తిరస్కరణ
● సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు
నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు.
జేఎన్‌వీ ఏర్పాటు
చేయాలని వినతి
జనగామ: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం (జేఎన్‌వీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ సంజయ్‌కుమార్, కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ప్రాచీపాండేను మంగళవారం ఢిల్లీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయమై వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
బచ్చన్నపేట: అన్నదాతలు పంటల రక్షణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, సమయానుకూలంగా మందులను చల్లుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వ్యవసాయ సంచాలకులు ఎస్‌ఎస్ బీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా రు. అనంతరం మండలంలోని కొన్నె గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో 5,046 టన్నుల డీఏపీ, 110 ట న్నుల పొటాష్, 437 టన్నుల కాంప్లెక్స్, 3,427 మెట్రిక్ టన్నుల ఎరువుల లభ్యత ఉందన్నారు. ఇటీవల వరి పంటలు పసుపు రంగులోకి మారుతున్నాయని, దాని నివారణకు జింక్ వాడుకో వాలని సూచించారు. ఏదైన సమస్యల నివారణకు ఆయా గ్రామాల ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ విధానాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, ఏఈఓ భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి
కృషి చేయాలి
జనగామ రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో జనగామ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఇ ంటింటికీ చేరేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీకోసం పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యకక్రమంలో మండల అధ్యక్షులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో యువత శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ ఆధ్వర్యంలో ప్రెస్టన్ గ్రౌండ్‌లో రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కొమ్మూరి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, కుమార్, అనిరుధ్, ప్రమోద్‌లు పాల్గొన్నారు.

ఒక నామినేషన్ తిరస్కరణ
Comments
Please login to add a commentAdd a comment