
బీరు మరింత ప్రియం
జనగామ: బీరుప్రియులకు మత్తెక్కించే వార్త. వేస వి ప్రారంభంలోనే ధరలకు రెక్కలు రావడంతో చల్ల ని బీర్లు లాగేద్దామని ఉబలాట పడే బీరు ప్రేమికుల కు కాసింత నిరాశ అని చెప్పుకోవచ్చు. రెండు నెలలుగా మార్కెట్‌లో బీర్ల కొరత తీవ్రం కాగా.. ప్రస్తు తం పెరుగుతున్న ధరలతో సరిపడా స్టాక్ రానుంది. దీంతో ఇక కాటన్లకు కాటన్లు కొనుగోలు చేసుకో వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బీర్లపై 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా.. కొత్త ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చా యి. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 47 మద్యం దుకాణాలతో పాటు పట్టణంలో ఐదు బార్లు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు పెరిగాయి.
జిల్లాలో రోజువారీగా రూ.47లక్షల అమ్మకాలు
ప్రభుత్వం బీరు బాటిల్‌పై ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.150 ఉన్న లైట్ బీరు ఇక నుంచి రూ.180, రూ.160 ఉన్న స్ట్రాంగ్ బీరు ఇక నుంచి రూ.190కి చేరనుంది. జిల్లాలో రోజువారీగా రూ.47లక్షల మేర (2,500 కాటన్లు) బీర్ల కాటన్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో బీరు ప్రియులపై రోజువారీగా రూ.7లక్షలకుపైగా అదనపు భారం ప డనుంది. మద్యం దుకాణాల్లో ప్రస్తుతం ఉన్న స్టా క్‌పై 15 శాతం పెంచి.. ఇందుకు సంబంధించిన ట్యాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేయనుంది. బీర్ల ధ రల పెంపుపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతుండగా.. ప్రతిపక్షాలు బాధుడు షురూ చేశారంటూ సె టైర్లు వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే లిక్కర్‌పై కూడా ధరలు పెరగనున్నాయనే ప్రచారం జరుగుతుంది.
జిల్లాలో మద్యం దుకాణాలు, అమ్మకాల వివరాలు
ఒక్కో బాటిల్‌పై 15శాతం పెంపు
జిల్లాలో రోజువారీగా 2,500 కాటన్లకు పైగా అమ్మకాలు
రూ.7 లక్షలకు పైగా భారం
అమల్లోకి కొత్త ధరలు
మద్యం దుకాణాలు :47
బార్లు :5
రోజువారీగా బీర్ల అమ్మకాలు :2,500 కాటన్లు
నగదు రూపంలో :రూ.47లక్షలు
పెరిగిన ధరలతో రోజువారీగా అదనపు భారం : రూ.7లక్షలు
Comments
Please login to add a commentAdd a comment