
ఆర్‌ఓ, ఏఆర్‌ఓల నియామకం
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యంలో అధి కార యంత్రాంగం నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎలక్షన్ అధికారుల నియామ క ప్రక్రియ పూర్తి కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల కోసం మంగళవారం ఆర్‌ఓ, ఏఆర్‌ఓలను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఎంపీటీసీ ఎలక్షన్ కోసం ఆర్‌ఓ, ఏఆర్‌ఓ (రిజర్వుడుతో) కలుపుకుని 55 మంది, జెడ్పీటీసీ కోసం ఆర్‌ఓలు 12 (ఒకరు రిజర్వుడు) 67 మందిని నియమించారు. ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేజీ–1 ఆఫీసర్ (ఆర్‌ఓ/గెజిటెడ్)–75(రిజర్వుడు–14 మంది), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్– 75 (ఏఆర్‌ఓ/నాన్ గెజిటెడ్)(రిజర్వుడు–12 మంది), పంచాయతీ ఎన్నికల కోసం స్టేజీ–2 రిటర్నింగ్ ఆఫీసర్స్–280(రిజర్వుడు–25) మంది పని చేయనున్నారు. గతంలో మూడు దశల్లో ఎలక్ష న్లు నిర్వహించగా, ఈసారి అధికార యంత్రాంగం రెండు దశల్లోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారు.
13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 783 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయగా, 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, అదే రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 14న అభ్యంతరాల పరిశీలన, అనంతరం ఎలక్షన్ కమిషన్ ఆమోదం పొందడం జరుగుతుంది. 15న తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తారు. బచ్చన్నపేట–81, చిల్పూరు–62, దేవరుప్పుల–68, స్టేషన్‌ఘన్‌పూర్–56, జనగామ–65, కొడకండ్ల–61, లింగాలఘణపురం–64, నర్మెట–41, పాలకుర్తి–106, రఘునాథపల్లి–85, తరిగొప్పుల–31, జఫర్‌గఢ్–63 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో ప్రదర్శించారు. జిల్లాలో స్థానిక సమరం నేపఽథ్యంలో ప్రకటించిన తుది జాబితాలో మొత్తం 4,0,1,101 ఓట్లు ఉండగా, మహిళలు 2,02,648, పురుషులు 1,98,448, అదర్స్ 5 ఉన్నారు. జిల్లాకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు, ఇతర మెటీరియల్ చేరుకోగా సంబంధిత అధికారులు అప్పగిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల
రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు
కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment