
విద్యుత్ సరఫరాకు ముందస్తు కార్యాచరణ
జనగామ: వేసవిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాదవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న సమ యంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. జనగామ సర్కిల్ పరిధిలో ఈ నెలలో గరిష్ట విద్యుత్ వినియోగం 317.82 మెగావాట్లుగా నమోదు అయిందన్నారు. రాబోయే మూడు నెలల్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో అంచనాల ప్రకారం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఎన్పీడీసీఎల్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
సేవలు సులభతరం..
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సే వలను అందించే లక్ష్యంలో భాగంగా కొత్త సర్వీ సుల మంజూరీ సేవలను సులభతరం చేసినట్లు ఎస్‌ఈ టి. వేణుమాదవ్ తెలిపారు. నూతన విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సాంకేతిక లోపంతో దానిని తిరస్కరిస్తే తక్షణమే ద రఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుందన్నారు. జతచేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు మరోమారు అవకాశం కల్పించామన్నారు.
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాదవ్
Comments
Please login to add a commentAdd a comment