దేవాలయ భూములను కాపాడాలి
పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షణకు రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, చైర్మన్ గంగు ఉపేంద్రవర్మ గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసి వినతి పత్రం అందజేశారు. దేవాలయ వ్యవస్థలో 3 రకాలైన వేతన విధానంతో దేవాలయ అర్చక సిబ్బంది జీతాలు మిగతా సిబ్బంది వలె ఒకటో తేదీన రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుండిగల్ ఆనంద్ శర్మ, పంచాగకర్త డాక్టర్ అవసరాల ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతిని విజయవంతం చేయండి
పాలకుర్తి: గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈ నెల 15 విజయవంతం చేయాలని స్టేషన్‌ఘణపూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న కోరారు. గురువారం పాలకుర్తిలో తహసీల్దార్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని అధికారులు, గిరిజన నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాలన్నారు. జయంతి రోజున రాజకీయ పార్టీల ఫొటోలు, జండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోకూడదని, చేస్తే తొలగిస్తామని తెలిపారు. సేవాలాల్ జయంతి సందర్భంగా 15న సేవాలాల్ నిర్మాణ మందిరం వద్ద భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, చంద్రమోహన్, శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌ఐ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
తరిగొప్పుల : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిన డీఆర్‌డీఓ వసంత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జీవనజ్యోతి రచనా మండల సమాఖ్య కార్యాలయంలో ఆరోగ్యంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో వసంత పాల్గొని మాట్లాడుతూ ప్రతి రోజూ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు పోషక పదార్థాలపై అవగాహన కలించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రంగమ్మ, ఏఎన్‌ఎం వసంత, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏపీఎం విజయ, సీసీలు రాములు, యాదగిరి, సిద్దులు, రాణి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
సాయి వైన్స్ సీజ్
జనగామ: జిల్లా కేంద్రంలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న సాయి వైన్స్‌ను సీజ్ చేసినట్లు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గరువారం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న దుకాణ యజమానులకు జరిమానా విధించగా, ట్రేడ్ లైసెన్స్ లేని వైన్స్‌ను మూసి వేయించారు. ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ పొందిన తర్వాతనే దుకాణాలను తెరుచుకోవాలని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గోపయ్య, ప్రత్యేక అధికారి పులి శేఖర్ ఉన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు
90 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జితేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో జనరల్, ఒకేషనల్ 644 విద్యార్థులకు 577 మంది హాజరు కాగా 67 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 492కి 469 మంది విద్యార్థులు హాజరు కాగా 23 విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఐఈఓ జితేందర్ రెడ్డి దేవరుప్పుల కొడకండ్ల పరీక్ష కేంద్రాలను సందర్శించగా జిల్లా పరీక్ష నియంత్రణ అధికారులు శ్రీనివాస్, వి.శేఖర్ స్టేషన్ ఘనపూర్, జఫర్‌గఢ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జనగామ పట్టణం, కొడకండ్ల పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.
దేవాలయ భూములను కాపాడాలి
Comments
Please login to add a commentAdd a comment