తనివితీరా మొక్కులు
● మేడారం మినీజాతరకు పోటెత్తిన భక్తులు
● ఉదయమే ఆలయాలకు వెళ్లిన వనదేవతలు
వనదేవతలకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించారు. నిలువెత్తు బంగారం, కోడి, యాటలను సమర్పించారు. బుధవారం రాత్రి అంతా గద్దెల వద్ద జాగారం చేసిన పూజారులు గురువారం ఉదయం పొద్దుపొడువక ముందే అమ్మవార్లను తీసుకొని మేడారం, కన్నెపల్లి ఆలయాలకు తిరిగి వెళ్లారు. భక్తులతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిక్కిరిసింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్‌ఎస్ తాడ్వాయి
– వివరాలు 8లోu
తనివితీరా మొక్కులు
Comments
Please login to add a commentAdd a comment