ప్రేమ.. లక్ష్యం రెండూ ముఖ్యమే
రామన్నపేట: ‘ప్రేమించడానికి, ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రేమికుల దినోత్సవం ఒక్క రోజు సరిపోదు. ప్రేమను పంచాలనుకుంటే ప్రతీ రోజు ప్రేమికుల దినోత్సవమే. ప్రేమించడం, ప్రేమ వివాహాలు చేసుకోవడం తప్పు కాదు. ప్రేమ మోజులో పడి తమ సమయాన్ని వృథా చేసుకుని లక్ష్యాలను వదిలిపెట్టి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవడం తప్పు. పాఠశాల విద్య వయస్సులో, ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ప్రేమపేరుతో విచ్చలవిడిగా తిరగడం సమంజసం కాదు. ఆ సమయంలో ఏర్పడేదంతా ఆకర్షణ మాత్రమే. ప్రేమకు, ఆకర్షణకు మధ్య మధ్య తేడా తెలుసుకుని సరైన వయస్సులో.. సరైన సమయంలో ప్రేమించడం, తల్లిదండ్రులను ఒప్పించడం.. లక్ష్యాలను సాధించి సంతోష జీవనం గడిపే ఆదర్శమైన ప్రేమ జంటగా నిలవాలి’ అని ఎల్బీ కళాశాల విద్యార్థులు అంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ కళాశాలలో గురువారం ‘ప్రేమ–ఆకర్షణ’పై నిర్వహించిన సాక్షి చర్చా వేదికలో యువత తమ అభిప్రాయాలను వెల్లడించింది.
తల్లిదండ్రులను ఒప్పించి
ప్రేమికులుగా గెలవాలి
సమయాన్ని వృథా చేసుకోవద్దు..
‘ప్రేమ–ఆకర్షణ’పై సాక్షి చర్చా వేదికలో అభిప్రాయాలు వెల్లడించిన
పలువురు విద్యార్థులు
ప్రేమ.. లక్ష్యం రెండూ ముఖ్యమే
Comments
Please login to add a commentAdd a comment