లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
● డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు
జనగామ : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలుపై శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లు తప్పనిసరి గా నియమ నిబంధనలు పాటించాలన్నారు. లింగనిర్ధారణను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆగ, మగ ఇద్దరినీ సమానంగా చూడాలన్నా రు. ఆస్పత్రికి వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో చట్టం అమలు సలహా సభ్యులు లవకుమార్‌రెడ్డి, కన్నా పరశురాములు, రవీందర్‌రెడ్డి, వైద్యులు స్వప్న, లింగమూర్తి, రవీందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలి
చిల్పూరు: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఆర్గనైజర్ మండ శ్రీనివాస్ కోరారు. మల్కాపూర్ పీహెచ్‌సీలోని అంబులెన్స్ వాహనాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరును పరిశీలించారు. వేసవి సమీపించినందున వేడి, డీహైడ్రేషన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈఎంటీ రాజేంద్రప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసన
జనగామ రూరల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో తొమ్మిదవ అడిషనల్ జడ్జిపై గురువారం జరిగిన దాడికి నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం కోర్టు న్యాయవాదుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎనగందుల చంద్రరుషి మాట్లాడుతూ.. పోక్సో కేసు కింద జడ్జి శిక్ష విధించారనే కారణంతో దాడికి దిగడం సరికా దని, నిందితులను చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నక్క సిద్దులు, న్యాయవాదులు నాగరాజు శర్మ, శ్రీరాం శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, కోట శంకర్, యుగేందర్, భిక్షపతి, లక్ష్మణస్వామి, రాంరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
స్టేషన్‌ఘన్‌పూర్: క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్‌గౌడ్, చైర్మన్ పోగుల సారంగపాణి, స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ జి.వేణు అన్నారు. పాంనూర్‌లో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలని, ఓటమిచెందిన వారు దిగులు చెందకుండా తమలోని లోపాలను సరిదిద్దుకుని క్రీడానైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యాన పాంనూర్‌లో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారు ఈనెల 20 నుంచి వికారాబాద్‌లో జరిగే అంతర్‌జిల్లాల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లుయాదవ్, అసోసియేషన్ మండల ఉపాధ్యక్షుడు ఇనుగా ల గణేష్‌రెడ్డి, కుమార్, సుధాకర్, పొన్న బీరయ్య, ఒగ్గు రాజు, కరుణాకర్‌రెడ్డి, నరేందర్, అన్వర్, సలీం, జీవన్, రాజేందర్, సఫీర్ తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment