విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు చదువుతో పాటు సమాజం, అలాగే చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జెడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన పట్టణ పరిధి వైష్ణవి హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం–2024, న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకున్న హక్కులను తెలుసుకోవాల ని చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, తల్లిదండ్రులకు చెప్పుకోవడం లేదా విద్యార్థులే కలిసికట్టుగా ఏర్పడి పరిష్కారానికి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా బాలికల్లో నలుగురు, బాలురలో ఇద్దరు చొప్పున గ్రూప్ లీడర్లను ఎంపిక చేసి చేశారు. పాఠశాలల్లో సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన పారాలీగల్ వలంటీర్లకు తెలియజేయాలని సూచించారు. బాలబాలికలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠినమైన శిక్ష తప్పదని, వేధింపుల విషయంలో సుప్రీంకోర్టు నుంచి జిల్లా స్థాయి వరకు కఠినమైన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ఉప్పలయ్య, కోఆర్డినేటర్ రవికుమార్, సభ్యులు శ్రీలత, స్వాతి, డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జెడ్జి విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment