బీఆర్‌ఎస్ నేతలకు మతిభ్రమించింది
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్‌ఎస్ నేతలు అధికారం కోల్పోయాక ఆగమవుతున్నారు.. మతిభ్రమించిన ట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి అధికారికంగా నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవా రం గిరిజన నాయకులతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలకు వింత జబ్బు పట్టుకుంది.. రోజూ మీడియాలో కనిపించకపోతే వారికి ఏమీ తోచడం లేదు.. ఈ జబ్బు ప్రధానంగా కేటీఆర్, కవితకు ఎక్కువగా ఉందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ నేతలు అప్పుల కుప్పగా మార్చారని, ఈవిషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారా మన్ చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయ ని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌దే విజయమని అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా
కాంగ్రెస్ పార్టీదే విజయం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment