శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస | - | Sakshi
Sakshi News home page

శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస

Published Sun, Feb 16 2025 1:21 AM | Last Updated on Sun, Feb 16 2025 1:19 AM

శివుడ

శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు

గారడి ముసుగు

ఎల్లమ్మ

గవ్వల బుట్ట

కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్‌ నుంచి మార్చి వరకు ఉమ్మడి వరంగల్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు.

సామగ్రికి ప్రసిద్ధి..

తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్‌, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్‌గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు.

సెట్టు రూ.13 వేల వరకు..

శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈసెట్టును రూ.6 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షణగా మెషిన్‌ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్‌లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు.

ముహూర్తం చూసి కొనుగోళ్లు..

జాతరల సీజన్‌లో పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించేవారు వారం రోజుల పాటు నిష్టగా ఉంటారు. ఒక్కపూట భోజనం.. ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఇదే సమయంలో పట్నాలు, బోనాలు చెల్లించేవారు.. ప్రత్యేక దుస్తులు, వస్తువులను కూడా దైవసమానంగా భావిస్తారు. అందుకే వీటిని కొనేటప్పుడు మంచి ముహూర్తం చూసి కొంటారని దుస్తుల తయారీదారులు చెబుతున్నారు.

మల్లన్న బుట్ట

పలు రాష్ట్రాలకు

ఇక్కడి నుంచే సరఫరా..

వీటి తయారీని నమ్ముకున్న

200 మంది

60ఏళ్లుగా ఉపాధి పొందుతూ..

భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..

గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్‌ కూడా చాలా బాగా ఉంటుంది.

– రావుల సుమలత, నడికూడ

No comments yet. Be the first to comment!
Add a comment
శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు 1
1/2

శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు

శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు 2
2/2

శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement