ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దీపక్‌కు చోటు
జనగామ రూరల్: ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్వకేషన్ రికార్డ్ హోల్డర్స్‌లో జనగామ పట్టణానికి చెందిన మోర్తాల దీపక్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాహన రహదారి(ఉమ్లింగ్ లా పాస్ – 19,024 అడుగుల ఎత్తు)ని 2021 నవంబర్ 16న, లడక్‌లోని కార్థుంగ్ లా పాస్‌ని(17,982 అడుగులు ఎత్తు) 2023 అక్టోబర్ 17న ద్విచక్ర వాహనంతో దీపక్ అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ఇంటర్ నేషనల్ కాన్వకేషన్ సందర్భంగా వియాత్నం దేశానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ చూ బయో క్యూ చేతుల మీదుగా దీపక్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రస్తుతం దీపక్ జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో రేడియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. దేశంలో బెస్ట్ మోటార్ సైకిల్ సాహస యాత్రికుడిగా పేరు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న దీపక్‌ను పలువురు అభినందించారు.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దీపక్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment