ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్
జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు సంబంధించి వెరిఫికేషన్ చేసేందుకు నాలుగు రోజులుగా విద్యాశాఖ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17న ప్రారంభమైన వెరిఫికేషన్ 20వ తేదీతో ముగియనుంది. జిల్లాలో ప్రభు త్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 183 ఉండగా, 6,234 మంది పదో తరుగతి విద్యార్థులు ఉన్నారు. వార్షిక పరీక్షల్లో 80 మార్కుల ఆప్షన్ ఉండగా.. స్కూల్ పరిధిలో ఇంటర్నల్‌గా 20 మార్కులు వేస్తా రు. ఇందులో పుస్తక సమీక్ష–5, రాత అంశాలు(నోట్స్)–5, ప్రాజెక్టు వర్కు–5, స్లిప్ టెస్ట్‌కు 5 మార్కులు ఉంటాయి. ఈ మార్కులు కరెక్టేనా.. లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక హెచ్‌ఎం, ఇద్దరు సబ్జెక్టు టీచర్లతో 21 టీంలను ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ఇంటర్నల్ మార్కుల కు సంబంధించి ఆన్సర్ షీట్లు, ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించాకే ఓకే చెబుతారు.
22 నుంచి ఆన్‌లైన్
పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేయగా, 20 ఇంటర్నల్ మార్కుల ను పాఠశాలలు, విద్యార్థుల వారీగా ఈనెల 22 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. వార్షిక పరీక్షలు ముగిసి ఫలితాల సమయంలో వీటిని అనుసంధానం చేసి తుది మార్కులు విడుదల చేస్తారు.
నేటితో ముగియనున్న ప్రత్యేక టీంల తనిఖీలు
22వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment