మహనీయుడు సేవాలాల్
స్టేషన్‌ఘన్‌పూర్: అందరి జీవితాలను, భవిష్యత్‌ను తీర్చిదిద్దిన మహనీయుడు సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శివునిపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఉత్సవ సమితి బాధ్యుడు బానోతు రాజేష్‌నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, నియోజకవర్గ కేంద్రంలో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రజ లకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. సంత్‌సేవాలాల్ చూపిన మార్గంలో నడుస్తూ గిరిజనులు అభివృద్ధి చెందాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోర్ బంజారా గురువు మహేష్‌మహరాజ్, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, బూర్ల శంకర్, గిరిజన నాయకులు భూక్య స్వామినాయక్, రమేష్ నాయక్, లకావత్ చిరంజీవినాయక్, కొర్ర వెంకటేష్ నాయక్, దశరథ్‌నాయక్, హుస్సేన్‌నాయక్, భిక్షపతి నాయక్, లక్ష్మణ్, లచ్చిరాం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment