నర్సిరెడ్డి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి
జనగామ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కోరా రు. గురువారం టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యాన పట్టణంలోని ఉమాపతి భవన్‌లో యూ నియన్ జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సిరెడ్డి గెలిస్తే ఓటరు గెలిచినట్లే.. మరెవరు గెలిచినా వెంట నే అధికార పార్టీలో చేరిపోయే అవకాశవాదులే అన్నారు. నర్సిరెడ్డి నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. నాయకులు డి.శ్రీనివాస్, రంజిత్‌కుమార్ చంద్రశేఖర్‌రావు, వెంకటేష్, అంకుషావళి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment