ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్‌! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్‌!

Published Sat, Feb 22 2025 1:57 AM | Last Updated on Sat, Feb 22 2025 1:54 AM

ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్‌!

ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్‌!

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్ని కల పోలింగ్‌కు ఐదు రోజులే గడువుంది. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రా ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్‌రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఆభరణాలు, పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాల ని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని చెప్పారు.

ఏర్పాట్లలో అధికారులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్‌ పరిధి ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ నిరంతరం పని చేసేలా విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్‌ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లాకేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్‌, రిసెప్షన్‌ సెంటర్లవద్ద అవసరమైన వసతులపై కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 8 గంట లకు పోలింగ్‌ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటలకు పోలింగ్‌ వివరాలు ప్రకటించేలా ఎన్నికల అధికారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు.

వేడెక్కిన ప్రచారం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి– స్వతంత్ర(యూటీఎఫ్‌ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్‌ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్‌ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి–స్వతంత్ర (పీఆర్టీయూ– టీఎస్‌ మద్దతు), పూల రవీందర్‌ – స్వతంత్ర (ఎస్టీ యూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్‌రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి ఏలె చంద్రమోహన్‌, చాలిక చంద్రశేఖర్‌, జంకిటి కైలాసం, జి.శంకర్‌, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజు లే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశాం

అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌

జనగామ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామని అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ అన్నారు. సీఈఓ వీసీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు మండలా లకు ఒక రూట్‌ చొప్పున నాలుగు రూట్లు ఏర్పాటు చేశామని, సెక్టోరియల్‌ అధికారులకు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్‌లకు విధులు కేటా యించినట్లు వివరించారు. అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏఎస్పీ పండారి చేతన్‌నితిన్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఏర్పాట్లపై కలెక్టర్లకు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు

27న పోలింగ్‌.. మార్చి 3న లెక్కింపు

ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

అభ్యర్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement