ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షల కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 8,945 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా.. ఇందులో ఫస్టియర్ 4,251 మంది, సెకండియర్ 4,694 మంది ఉన్నారు. 17 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. పర్యవేక్షణకు సెంటర్‌కు ఒకరి చొప్పున పర్యవేక్షణ, అదనపు పర్యవేక్షణ అధికారులను నియమించారు. ఒక్కో ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్‌తో పాటు 300 వరకు ఇన్విజిలేటర్లకు విధులు కేటాయించారు. ప్రశ్నపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
సెంటర్ లొకేటర్ యాప్..
గతంలో పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి లొకేటర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విద్యార్థులు సులువుగా పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ల జారీలో ప్రయివేట్ కళాశాలలు పెట్టే ఇబ్బందుల నేపథ్యంలో వెబ్‌సైట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే జిల్లా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. వాటిని ఎస్కార్ట్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో సెంట ర్లకు తరలించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. పరీక్షల సమయంలో సమీప బుక్‌స్టాళ్లు, జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని అధికా రులు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సు సౌకర్యం
గురుకుల, మోడల్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరం ఉంటే.. సంబంధిత విద్యార్థులను సెంటర్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా అప్ అండ్ డౌన్ చేరవేసే వెసులుబాటు ను ప్రభుత్వం కల్పించింది.
అందుబాటులో వైద్య సిబ్బంది..
ఎగ్జామ్ సెంటర్ల వద్ద వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, సూపర్ వైజర్లకు విధులు కేటాయించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
పరీక్షలు సజావుగా నిర్వహించాలి
ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి. ఇందుకు వైద్య, పోలీ సులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. తాగునీరు, అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలి. పరీక్షల సమయాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడిపించాలి.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
నిమిషం ఆలస్యమైనా
అనుమతించరు..
జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించ డానికి ఏర్పాట్లు చేస్తున్నాం. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్ల జారీ విషయంలో విద్యార్థుల ను ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రమేశ్, డీఈఓ
రేపటి నుంచి 25వ తేదీ వరకు..
హాజరుకానున్న
8,945 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 17 పరీక్ష కేంద్రాలు
సెంటర్ల గుర్తింపునకు లొకేటర్ యాప్..
పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్నపత్రాలు
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment