‘నీట్–2025’ కేంద్రాలను గుర్తించండి
● సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించా రు. మే 4న జరిగే ‘నీట్’ పరీక్ష నిర్వహణ, సెంటర్ల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న మాట్లాడారు. నీట్ పరీక్షకు జిల్లాలో నాలుగు సెంటర్లు అవసరమని, 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలను గుర్తించా లని చెప్పారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండే ఫర్నిచర్, వెంటిలేషన్, తాగునీరు, సీసీ టీవీల పర్యవేక్షణ, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, కలెక్టరేట్ ఏఓ మన్సూరీ, డీఈఓ రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment