31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ
జనగామ: పట్టణ ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం పురపాలికలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ లోగా తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకు న్న యజమానులకు 25 శాతం రాయితీ సదుపా యం ఉందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం రూ.వెయ్యి చెల్లించి 2020 సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్న ప్లాట్ల యజమానులు లే అవుట్లలోని వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పారు. అనుమతి లేని లేఅవుట్లలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేసుకుని, మిగిలి న వాటిని కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము సైతం చెల్లించి పర్మనెంట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 25 శాతం రాయితీ పొందిన ఎం.సిద్ధులుకు ప్రొసీడింగ్ కాపీ అందజేశా రు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ జె.ప్రశాంతి తదితరులు ఉన్నారు.
సద్వినియోగం చేసుకోండి
మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment