ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్
పాలకుర్తి టౌన్: బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవా రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. రికార్డులు, రిస్పెషన్, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధులకు సంబంధించి సూ చనలు చేశారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్, లింగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment