పంట పొలాలకు నీరందించాలి
జనగామ రూరల్: యాసింగిలో సాగు చేసిన వరి పంట పొలాలకు నీరు లేక ఎండుతున్నాయి.. తక్షణ మే నీరందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. పదెకరాల్లో సాగు చేసిన వరి ఎండిపోయి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు గుత్తి రాములు–మల్లమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదెకరాల పంట అక్కరకు రాకుండా పోయిందని మరో రైతు నిమ్మల భాస్కర్ ఎండి న కొయ్యలను చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏటా రెండు సీజన్లలో ఒక్కరోజు కూడా పంటలు ఎండి పోలేదని, కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొలాలకు నీరందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించా రు. ఎమ్మెల్యే వెంట యాదగిరిగౌడ్, శంకర్‌నాయక్, నీల యాదగిరి, శ్రీనివాస్, భాస్కర్, మసిఉర్ రెహమాన్, సందీప్ తదితరులున్నారు.
లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment