స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు
జనగామ: స్కానింగ్ సెంటర్లలో నియమ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు తెలిపారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ డి.రవీందర్‌గౌడ్, ఆర్టీఓ కార్యాలయ డీఏఓ ఆండాలు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ గౌసియాబేగంతో కలిసి సోమవారం పట్టణంలోని సత్య స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో రిజిస్టర్ మెయింటనెన్స్ చేపట్టాలని, రేడియాల జీ, గైనకాలజిస్టులు మాత్రమే స్కానింగ్ తీయాలని చెప్పారు. ఫారం–ఎఫ్‌లో స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, భర్త పేరు, పిల్లల సంఖ్య, ఫోన్ నంబర్‌తో పాటు డాక్టర్ పేరు నోట్ చేసుకుని ప్రతి నెలా 5వ తేదీ లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది మారిన సమయంలో నమోదు చేసుకోవా లని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించేలా తెలుగు, ఆంగ్ల భాషలో బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్కానింగ్ చేసే డాక్టర్ సర్టిఫికె ట్ కాలపరిమితి ముగియకుండా జాగ్రత్తలు తీసుకో వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment