మున్సిపల్‌లో ఆడిట్ షురూ
జనగామ: జనగామ మున్సిపల్‌లో 2023–24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా సహాయక ఆడిటింగ్ అధికారి రెహమాన్‌ఖాన్, సీనియర్ ఆడిటర్లు నవీద్ ఫారుఖీ, జి.అనిల్ కుమార్ నేతృత్వంలో ఆడిటింగ్ చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇంటి అనుమతులు, పన్నుల రూపంలో వచ్చిన జనరల్ ఫండ్.. ఖర్చులకు సంబంధించి ఆడిటింగ్ చేయనున్నారు. ఏడాది రాబడి, ఖర్చుల వివరాలను అధికారులు ఆడిట్ బృందానికి అప్పగించారు. నెలరోజుల లోపు ఆడిట్ పూర్తి కానుంది.
జాతీయస్థాయిలో ప్రతిభ
చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వేల్పుల కార్తీక్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అన్నెపు కుమార్, హెచ్‌ఎం కేతిడి నరసింహారెడ్డి, పీడీ దేవ్‌సింగ్‌లు తెలిపారు. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగవ సౌత్‌జోన్ జాతీయ స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాఽధించినట్లు తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో కార్తీక్‌ను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, చిర్ర నాగరాజు, శ్యాంసుందర్, కుంచాల సంపత్‌రాజు తదితరులు అభినందించారు.
జూనియర్ అసిస్టెంట్
పే స్కేల్ ఇవ్వాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్లకు ఇచ్చే పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ జనగామ మున్సిపల్‌లో విధులు నిర్వర్తిస్తున్న వార్డు ఆఫీసర్లు మంగళవారం సీఎస్, పే రివిజన్ కమిషన్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతిని పంపించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీఓ 109 ద్వారా గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించి, జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 1,862 మందిని ఆయా శాఖల వారీగా భర్తీ చేయగా, జనగామ మున్సిపల్‌లో 13 మంది వార్డు ఆఫీసర్లు, ఇద్దరు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టారన్నారు. వారికి జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు ఇచ్చే పేస్కేల్ రూ.24,280 వేతనం కాకుండా రికార్డు అసిస్టెంట్‌కు ఇస్తున్న రూ. 22,240 ఇస్తున్నారన్నారు. వార్డు ఆఫీసర్లుగా పని చేస్తున్న ప్రతీఒక్కరికి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
శరవేగంగా లిఫ్ట్ పనులు
వారంరోజుల్లో అందుబాటులోకి..
జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండవ అంతస్తుల వరకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. రెండు అంతస్తుల్లో ఉన్న జనరల్ వార్డులతో పాటు డయాలసిస్, ఎక్స్‌రే, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకు, ఆపరేషన్ థియేటర్, ఇతర సేవలకు సంబంధించి పేషెంట్లకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా పనులు చేస్తున్నారు. లిఫ్ట్ అందుబాటులోకి వస్తే పేషెంట్లకు ఇబ్బందులు తప్పనున్నాయి.
పోలీస్ జాగిలాల
పాత్ర కీలకం
వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ పాల్గొన్నారు.
మున్సిపల్‌లో ఆడిట్ షురూ
మున్సిపల్‌లో ఆడిట్ షురూ
Comments
Please login to add a commentAdd a comment