లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ పరిధిలో ఉన్న 72.2 ఎకరాల దేవస్థాన భూమి, ఆలేరు మండలంలోని కొల్లూరులో ఉన్న 1.27 ఎకరాలకు మంగళవారం కౌలుకు వేలం నిర్వహించగా రూ.2.48,500లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. జీడికల్‌లోని భూమిని యాదాద్రి జిల్లాకు చెందిన సూదగాని జయరాములు 3 ఏళ్లకు గాను రూ.2,45,000లకు, కొల్లూరులోని 1.27 ఎకరాలకు అదే గ్రామానికి చెందిన తెడ్డు భిక్షపతి 3 ఏళ్లకు రూ.3,500లకు వేలం పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఉప్పలమ్మ దేవాస్థానం ఈఓ కె.రాములు, స్థానిక దేవాలయ సిబ్బంది భరత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment