నేరాలను నియంత్రించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్
బచ్చన్నపేట: జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించాలని డీసీపీ రాజ మహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ట్రాన్స్‌కో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ టి.వేణుమాదవ్‌తో కలిసి మాట్లాడారు. పలు గ్రామాల్లో రాత్రి వేళ దుండగులు వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులగొట్టి కాపర్ వైరు ఎత్తుకెళ్తున్నారన్నారు. దాని విలువ కేవలం రూ.60 వేలు ఉంటుందని, అదేస్థానంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ రావడానికి వారం రోజుల సమయం పడుతుందన్నారు. ఆ సమయంలో అన్నదాతల వరి పొలాలు ఎండిపోతున్నాయని, అందుకే రాత్రి వేళ రైతులు కూడా ఓ కన్ను వేసి ఉంచాలన్నారు. కాపర్ వైర్ చోరీ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అనంతరం ఉత్తమ అ ధికారిగా ఎంపికై న జేఎల్‌ఎం శ్రీరాం పర్శరాములుకు డిపార్ట్‌మెంట్ తరఫున బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ లక్ష్మి నారాయణరెడ్డి, విజయ్‌కుమార్, ఏడీఈ వేణుగో పాల్, ఏఎస్సీ నితిన్ చేతన్, సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్, ఏఈ రాజ్‌కుమార్, రాజవర్ధన్‌రెడ్డి, అజయ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీందర్‌శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు జాతీ య లోక్ అదాలత్ చక్కని వేదిక అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment