గూగుల్ షీట్‌లో నల్లా పన్ను వివరాలు
జనగామ: నల్లా పన్ను బిల్లుల చెల్లింపులపై అధికార యంత్రాంగం కదిలింది. ‘ఆఫ్‌లైన్ మాయ–నల్లా బిల్లులు చెల్లించినా... ఆన్‌లైన్‌లో బకాయి చూపిస్తున్న వైనం’ అనే శీర్షికన ఈ నెల 3న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. ఆఫ్‌లైన్‌లో నల్లా పన్నులు తీసుకున్నా.. ఆన్‌లైన్‌లో బకాయి ఉన్నట్టు చూపించడంపై కమిషనర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు 2016 నుంచి పట్టణంలో నల్లా కలెక్షన్లు ఎన్ని... ఏటా డిమాండ్ ఎంత... అనధికారిక ట్యాప్‌లు ఎన్ని అనే దానిపై లెక్కలు తీస్తున్నారు. కరోనా సమయంలో లెక్క తెలియని రశీదు బుక్స్ మాయమైన సంఘటన పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం ప్రజలకు తెలిసిందే. ఆ బుక్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు లెక్కాపత్రం లేదు.
200పైగా రశీదు బుక్స్..
ప్రస్తుతం సీడీఎంఏ నుంచి ఆన్‌లైన్‌కు అప్రూవల్ లేకపోవడంతో 10 ఏళ్ల నాటి సుమారు 200 పైగా రశీదు బుక్స్‌ను ఆఫ్‌లైన్ ద్వారా ఒక్కో వినియోగదారుడి వివరాలను గూగుల్ షీట్‌లో నమోదు చేస్తున్నారు. ఇందులో మరో 10 బుక్స్ వరకు మిస్ అయినట్లు తెలుస్తుంది. సాక్షిలో వచ్చిన కథనం పట్టణంలో వైరల్ కాగా... ఆఫ్‌లైన్‌లో నల్లా పన్ను చెల్లించిన వినియోగదారులు... పాత రశీదులను వెతుకులాడే పనిలో ఉన్నారు.
అనధికార కనెక్షన్లు ఎన్ని..?
పట్టణంలోని పలు వార్డుల్లో వందలాది అనధికారి నల్లా కనెక్షన్లు ఉన్నట్టు సమాచారం. ఇంటి అనుమతులు, అమ్ముకునే సమయంలో కేవలం ఆస్తిపన్ను తీసుకుని, నల్లా పన్నులు ఉన్నాయా లేదా అని పట్టించుకోలేదు. నల్లా పన్ను బకాయి ఉండగానే... ఇంటిని మరొకరికి అమ్ముకోగా... అతనికి సైతం మరో ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంతో ఒకే ఇంటి నంబ ర్‌పై రెండు చూపిస్తున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అనధికార కనెక్షన్ల బాగోతం బయటకు వస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
కలెక్టర్ ఆదేశాలతో
కదిలిన యంత్రాంగం
పాత రశీదు బుక్స్ వెతుకుతున్న మున్సిపల్ సిబ్బంది
గూగుల్ షీట్‌లో నల్లా పన్ను వివరాలు
Comments
Please login to add a commentAdd a comment