టెన్త్‌లో మొదటిస్థానంలో నిలవాలి
పాలకుర్తి టౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మొదటిస్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్‌లో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య అధ్యక్షతన టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన విజయోస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల నుంచి సుమారు 668 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక ప్రధాన ఘట్టమన్నారు. క్రమశిక్షణ, సమయ పాలన పాటిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధిచాలన్నారు. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఇష్టం, ఉత్సాహంతో చదవితే ఓటమన్నది ఉండదన్నారు. సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాడిశెట్టి రమేశ్, జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా పరీక్షల విభాగాధికారి చంద్రబాను, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆవుల రాములు, ఆర్‌ఐ రాకేష్, నరసింహమూర్తి, వాసుదేవరెడ్డి, శ్యామూల్ ఆనంద్, వెంకటేశ్వర్లు, శోభారాణి, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాకు
అంతరాయం లేకుండా చూడాలి
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజాజ్వాన్ బాషా అన్నారు. మండల కేంద్రలంలోని 33/11కేవీ విద్యుత్ సబ్‌సేష్టన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సేష్టన్ నిర్వహణ తీరును ఫ్యూజ్ కనెక్షన్, విద్యుత్ డిమాండ్ తదితరల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ రాకేశ్, సబ్ ఇంజనీర్ రాకేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
‘నీట్’ పరీక్ష కేంద్రాల పరిశీలన
జనగామ రూరల్: మే 4వ తేదీన జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ 2025) నిర్వహణకు పరీక్ష కేంద్రాల ఎంపికకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ పాఠశాల, సెయింట్ మేరీస్ పాఠశాల, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలను డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నుంచి 850 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, భద్రత దృష్ట్యా ప్రహరీ, విద్యుత్ సరఫరా, తదితరాల సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ శిల్పా, సీఐ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి జీవితంలో ‘పది’ ప్రధాన ఘట్టం
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment