● అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్
లింగాలఘణపురం: విద్యార్థులు స్వయం అభ్యసనతో విద్యాభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ అన్నారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపి కైన నేలపోగుల యూపీఎస్, కళ్లెం పీఎస్‌లలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత బోధనకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ–ల్యాబ్‌లో బోధన చేసి వారిని అభివృద్ధి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్, ఏఎంఓ శ్రీనివాసు, జీసీడీఓ గౌసియా, ఎంఈఓ విష్ణుమూర్తి, కాంప్లెక్ హెడ్మాస్టర్, శ్రీలత, నేలపోగుల హెడ్మాస్టర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.