రఘునాథపల్లి: నిడిగొండ రైల్వే ట్రాక్ వద్ద కొనసాగుతున్న రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) ఓ వైపు ఇరుకుగా నిర్మాణం చేయడంపై పలు గ్రామాల ప్రజలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఫతేషాపూర్ వైపు అండర్‌గ్రౌండ్‌లో 32 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తుండగా, నిడిగొండ వైపు మాత్రం 20 ఫీట్లకే పరిమితం చేయడంపై పతేషాపూర్, ఇబ్రహీంపూర్, లక్ష్మీతండా, రామచంద్రగూడెం, మాధారం గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్‌యూబీ వద్దకు తరలి వచ్చి నిరసన చేపట్టారు. స్పందించిన కాంట్రాక్టర్ నిడిగొండ వైపు 24 ఫీట్ల వెడల్పుతో పనులు చేపట్టడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ ఆందోళనలో మాజీ సర్పంచ్‌లు గాజులపాటి మహేందర్, ఎండీ హయతలి, శాగ నాగరాజు, ఎండీ షబ్బీర్, గొట్టం కర్ణాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పోకల శ్రీనివాస్, దొరగొల్ల యాదగిరి, మేకల శంకరయ్య, ఎండీ గౌస్, నేతాజీ, వీరోజి, మేడిపల్లి నరేష్, శ్యామల ర ఘు, లోడె నర్సయ్య, పోతులూరి తదితరులు ఉన్నారు.