జనగామ: జాతీయ స్థాయిలో బుధవారం విడుదల చేసిన గేట్ (బీటెక్/సివిల్ ఇంజనీర్) పరీక్షలో జనగామ జిల్లా కేంద్రం బాలాజీనగర్‌కు చెందిన అక్కినెపల్లి సాత్విక్‌చంద్రకు గేట్ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకు 123 సాధించి సత్తా చాటాడు. పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, గీతారాణిల పెద్ద కుమారుడు ఐఐటీ మద్రాసులో ఎంటెక్ (జియో టెక్నికల్ ఇంజనీరింగ్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన బీటెక్ బేసిక్‌పై గేట్ పరీక్ష రాశాడు. ఆల్ ఇండియాలో 123వ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
13శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలి
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు 13 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింప జేయాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేశ్ బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపల్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, నిబంధనల మేరకు హెడ్ క్వాటర్‌తో పాటు 8 కిలో మీటర్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏను అమలు చేయాలన్నారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: 108 అంబులెన్స్ సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో 108, 102, 1962 అంబులెన్స్ సిబ్బంది, పరికరాల పనితీరును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రధానంగా 108 సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన సమయంలో సేవలు అందేలా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్ దోమ రాజురెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన
దేవరుప్పుల: మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ ఆధ్వర్యంలో అమరావతి విశ్వవిద్యాలయంలో బుధవారం తలపెట్టిన లోక్ మాన్య సమరోత్సాహం–2025లో పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూకై లాస్ యక్షగాన నాటకం వేసి తెలంగాణ గ్రామీణ ప్రాంత సాంస్కృతిక కళా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమ్మయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం రఘుపతి, శ్రీపతి, సోమరాజు, ప్రభాకర్, ముకుందం, మురళీకృష్ణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
గేట్‌లో ఆల్ ఇండియా 123వ ర్యాంకు
గేట్‌లో ఆల్ ఇండియా 123వ ర్యాంకు