● జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్
జనగామ రూరల్: యాదవులు సామాజిక, ఆర్థిక రా జకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలని యాదవ హ క్కుల పోరాట సమతి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు తాటికొండ వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో యాదవుల సంక్షేమంపై పట్టింపులేదని విమర్శించారు. ఈ నెల 28న ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించే యాదవ శంఖారావంకు యావులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్, భాస్కర్, శ్రీనివాస్, మల్లేష్, ఐలేష్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.