జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్లపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్, ఆర్‌ఓ, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్స్‌లతో కలెక్టర్ బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోజువారి టార్గెట్, వసూళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. పన్నుల బకాయిదారులకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి పన్నులు ఎన్ని వచ్చాయనే విషయమై అడిగి తెలుసుకున్నారు. పన్నులు చెల్లించకుండా జాప్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేటి నుంచి (గురువారం) పన్నుల వసూళ్లలో పురోగతి సాధించక పోతే సహించేది లేదన్నారు. అలాగే నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయి, వసూళ్లపై ఆరా తీశారు.
జూమ్ మీటింగ్‌లో కలెక్టర్ రిజ్వాన్‌బాషా