జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు 4,214 మందికి గాను 4,069 మంది విద్యార్థులు హాజరు కాగా 141 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. కాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో పరీక్ష సరళిని పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.