జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపో లాజిస్టిక్(కార్గో) ద్వారా భక్తుల ఇంటికే శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు అందించనున్నట్లు డిపో మేనేజర్ ఎస్.స్వాతి తెలిపారు. శనివారం ఆమె డిపోలో సీతారామ చంద్రస్వామి కల్యాణ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. భక్తులు జనగామ బస్టాండ్ ఆవరణలోని కార్గో లాజిస్టిక్ ద్వారా బుక్ చేసుకోవచ్చ ని, మరిన్ని వివరాలకు 9154298762 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
మహిళా రైతులకు చేయూత
జనగామ రూరల్: వ్యసాయ యాంత్రీకరణకు 50 శాతం రాయితీతో మహిళా రైతులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని డీఏఓ రామారా వు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రొటోవేట ర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజ్‌వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టె యంత్రాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు, నాగలి, పవర్ టిల్లర్ తదితర 289 యూనిట్ల వ్యవసాయ యంత్రాలు(రూ.69.89 లక్షలు) మంజూరయ్యాయని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా మండల వ్యవసాయాధికారులకు లేదా ఏఈఓలకు అందజేయాలని సూచించారు. ఎంపికైన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ తీసి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
నలుగురు విద్యార్థుల గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో శనివారం రెండో రోజు జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. 6,202 మంది విద్యార్థులకు 6,198 మంది పరీక్ష రాసినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. పట్టణంలోని ధర్మకంచ, సెయింట్ మేరీస్ సెంటర్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా, కొడకండ్ల, పాలకుర్తి సెంటర్లను డీఈఓ సందర్శించారు.
డాక్టర్ల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, జఫర్‌గఢ్, బచ్చన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు పద్ధతిన వైద్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాంజనేయులు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, నేత్ర వైద్యులకు సంబంధించి ఎంబీబీఎస్ అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు కలెక్టరేట్ రూం నంబర్–16లో దరఖాస్తు అందజేయాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్టు)కు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్(జీడీఎంఓ)కు నెలవారీ వేతనం రూ.52,351 ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://jangaon.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
‘పీఎం కుసం’ స్కీం
రైతులకు ఉపయోగం
జనగామ రూరల్: ‘పీఎం కుసం’ స్కీం రైతుల కు ఎంతో ఉపయోగమని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్ అన్నారు. శనివా రం జనగామ సర్కిల్ పరిధిలో టీజీ ఎన్పీడీసీ ఎల్, టీజీ రెడ్‌కో ఆధ్వర్యాన ిపీఎం కుసుం స్కీంపై రైతు సమూహాలు, సహకార సంఘాలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద జిల్లాలో 179 మంది రైతులు 242 మెగావాట్ల సోలార్ విద్యు త్ ఉత్పత్తి ప్లాంట్లకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. సదస్సులో డివిజనల్ ఇంజనీర్(టెక్నికల్) గణేష్, జనగామ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు